Thursday, March 9, 2017

ATM చార్జీల నిబందనలు

దిమ్మ తిరిగే షాకిచ్చిన బ్యాంకులు ATM చార్జీల నిబందనలు :



ఏప్రిల్ 1 అనగానే గుండెలు బాదుకుంటున్నారు బ్యాంక్ ఖాతాదారులు. ఇంకో 20 రోజుల్లో ఏప్రిల్ 1 నుండి బ్యంక్ ఖాతాల్లో మినిమమ్ బ్యాలన్స్ ఉండకుంటే జరిమానా విధిస్తామని బ్యాంకులు వెల్లడించాయి. ఇప్పుడు ATM లవాదేవిలపై కూడా చార్జీలు విధించానున్నాయి. పరిమితికి మించి ATM లావాదేవీలు చేస్తే ఫైన్ రూపంలో డబ్బును వసూళ్ళు చేయడానికి రెడీగా ఉన్నాయి. వారానికి 50,000 రూపాయలు విత్‌డ్రా చేసేలా అన్ని బ్యాంకులు ఓకే నిబందనను అమలుచేశాయి.

ఏయే బ్యాంక్.. ATM బాదుడు ఎలా ఉందో తెలుసుకుందాం.. 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) :

ATM ఉచిత ట్రాన్సాక్ష‌న్లు – 5 ( ఐదు )
ఆ త‌ర్వాత జ‌రిపే ప్ర‌తి ట్రాన్సాక్ష‌న్స్ కు రూ.10 క‌ట్ అవుతుంది
హోంబ్యాంక్ ఏటీఎం కార్డు నుంచి మూడు ట్రాన్సాక్ష‌న్లు జరుపవచ్చును. ఇత‌ర బ్యాంకు ఏటీఎంలో అయితే కార్డును 2 సార్లు ఉప‌యోగించవచ్చు . హోంబ్యాంక్ ATM నుంచి 5 సార్లు తీసుకున్నా చార్జీ పడదు. అయితే ఇతర బ్యాంక్ నుంచి మాత్రం 2 సార్లు కంటే ఎక్కువ వాడితే రూ.10 కట్ అవుతుంది. మీ లిమిట్ 5  ట్రాన్సాక్షన్స్ ఉన్నా.. ఇతర బ్యాంక్ ATM నుంచి మూడో లావాదేవీ జరిపితే చార్జ్ పడుతుంది.
HDFC బ్యాంక్‌
ATM ఉచిత ట్రాన్సాక్ష‌న్లు – 5
ఆ త‌ర్వాత జ‌రిపే ప్ర‌తి ట్రాన్సాక్ష‌న్స్ కు రూ.20 క‌ట్ అవుతుంది
హోంబ్యాంక్ ఏటీఎం కార్డు అయితే మూడు ట్రాన్సాక్ష‌న్లు జ‌రుపొచ్చు అదే ఇత‌ర బ్యాంకు ఏటీఎంలో అయితే కార్డును 2 సార్లు ఉప‌యోగించొచ్చు. హోంబ్యాంక్ నుంచి ఐదు లావాదేవీలకు చార్జ్ పడదు. ఇతర బ్యాంక్ నుంచి మూడో ట్రాన్సాక్షన్ కింద రూ.100 తీసుకున్నా.. 20 రూపాయల చార్జ్ వసూలు అవుతుంది. అంటే 100 రూపాయలకు.. 120 కట్ అవుతుంది.
ICICI బ్యాంక్
ATM ఉచిత ట్రాన్సాక్ష‌న్లు – 5
ఆ త‌ర్వాత జ‌రిపే ప్ర‌తి ట్రాన్సాక్ష‌న్స్ కు రూ.20 క‌ట్ అవుతుంది
హోంబ్యాంక్ ఏటీఎం కార్డు అయితే మూడు ట్రాన్సాక్ష‌న్లు జ‌రుపొచ్చు అదే ఇత‌ర బ్యాంకు ఏటీఎంలో అయితే కార్డును 2 సార్లు ఉప‌యోగించొచ్చు. హోంబ్యాంక్ నుంచి ఐదు లావాదేవీలు ఉచితం. ఇతర బ్యాంక్ నుంచి మూడో ట్రాన్సాక్షన్ కింద చేస్తే మాత్రం రూ.20 చార్జ్ పడుతుంది. టోటల్ గా ATM నుంచి ఐదు లావాదేవీలు మాత్రమే ఫ్రీ.
యాక్సిస్ (AXIS) బ్యాంక్‌
ATM ఉచిత ట్రాన్సాక్ష‌న్లు – 5
ఆ త‌ర్వాత జ‌రిపే ప్ర‌తి ట్రాన్సాక్ష‌న్స్ కు రూ.20 క‌ట్ అవుతుంది
హోంబ్యాంక్ ఏటీఎం కార్డు అయితే మూడు ట్రాన్సాక్ష‌న్లు జ‌రుపొచ్చు , అదే ఇత‌ర బ్యాంకు ఏటీఎంలో అయితే కార్డును 2 సార్లు ఉప‌యోగించొచ్చు. ICICI, HDFC నిబంధనలనే యాక్సిస్ బ్యాంకు కూడా అమలు చేస్తోంది.

No comments:

Post a Comment