Friday, December 23, 2016

కారు కొనాలంటే ఆ సర్టిఫికెట్ మస్ట్

కారు కొనాలంటే ఆ సర్టిఫికెట్ మస్ట్



కారు కొనుక్కోవాలనే మీ కల సాకారం కావాలంటే ఇక నుంచి అంత ఈజీకాదు. జేబులో డబ్బులుంటే సరిపోదు.. పార్కింగ్ సర్టిఫికెట్ మస్ట్ గా ఉండాలి. ఈ నిబంధన అతి త్వరలో అమల్లోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది కేంద్రం. సిటీల్లో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్, ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ తో ఏర్పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ కండీషన్ తీసుకొస్తోంది కేంద్రం. నా కారు పార్కింగ్ కు స్థలం ఉన్నది అని మనమే చూపించుకోవాలి. పార్కింగ్ ప్లేస్ సర్టిఫికెట్ లేకపోతే మీ వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయరు. మనం నివసించే ఇంటిలో పార్కింగ్ ప్లేస్ ఉన్నట్లు.. సంబంధిత బిల్డర్ లేదా సొసైటీ లేదా బిల్డింగ్ అప్రూవ్ చేసే కార్పొరేషన్, మున్సిపాలిటీ, పంచాయతీలోని ప్లానింగ్ డిపార్ట్ మెంట్ నుంచి సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. ఈ విషయంపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు.. రవాణా శాఖ మంత్రి గడ్కరీతో కూడా చర్చించారు. అతిత్వరలో మార్గదర్శకాలు రానున్నాయి. వచ్చే ఏడాది నుంచి అమల్లోకి తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్ లోని 60శాతం కార్లకు ఇళ్లలో పార్కింగ్ ప్లేస్ లేదు. వీళ్లందరూ ఇళ్ల ముందే పార్క్ చేస్తున్నారు. పంచాయతీల్లో అయితే 10, 12 కుటుంబాలు నివాసం ఉండేలా అపార్ట్ మెంట్ల నిర్మాణాలు చేశారు. అందుకు తగ్గట్టు పార్కింగ్ ప్లేస్ మాత్రం ఉండటం లేదు.

Thursday, December 22, 2016

Jobs.... Jobs....

Jobs...Jobs...Jobs....

రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ :


రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ ఆధ్వర్యంలోని నార్తర్న్‌ రైల్వే(ఢిల్లీ)- గూడ్స్‌ గార్డ్‌ & ఎఎస్‌ఎం పోస్టుల భర్తీకోసం ఉద్దేశించిన జనరల్‌ డిపార్ట్‌మెంటల్‌ కాంపిటీటివ్‌ ఎగ్జామినేషన్(జిడిసిఇ) కి దరఖాస్తులు కోరుతోంది. 
గూడ్స్‌ గార్డ్‌ 
ఖాళీలు: 102 
అర్హత: డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి 
ఎఎస్‌ఎం 
ఖాళీలు: 168 
అర్హత: డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు డిప్లొమా(రైల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌)పూర్తిచేసి ఉండాలి. 
వయసు: 42 ఏళ్లకు మించరాదు 
నార్తరన్ రైల్వే, రైల్‌ కోచ్ ఫ్యాక్టరీ కపుర్తల, మోడరన్ కోచ్ ఫ్యాక్టరీ రాయబరేలీ, డీజిల్‌ కాంపొనెంట్‌ వర్క్‌షాప్‌ పాటియాలా లో పనిచేస్తున్న ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చు. 
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: డిసెంబరు 21 నుంచి 
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: 2017 జనవరి 20 
దరఖాస్తు కాపీ చేరేందుకు ఆఖరు తేదీ: 2017 జనవరి 23 
వెబ్‌సైట్‌: www.rrcnr.org/


ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్‌




ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్‌ - కింది విభాగాల్లో కమిషన్డ్ ఆఫీసర్స్‌ పోస్టుల భర్తీకోసం ఉద్దేశించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష(ఎఎఫ్‌క్యాట్‌)కు దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: ఫ్లయింగ్‌, గ్రౌండ్‌ డ్యూటీ (టెక్నికల్‌ నాన్ టెక్నికల్‌)
ఫ్లయింగ్‌
అర్హత: ఇంటర్‌(ఎంపిసి) + 60 శాతం మార్కులతో సాధారణ డిగ్రీ గానీ ఫస్టు క్లాస్‌ మార్కులతో బిఇ/ బిటెక్‌/ ఎఎంఐఇ- సెక్షన ఎ, బి గానీ ఏరోనాటికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా వారి డిగ్రీ గానీ ఉండాలి
వయసు: 2018 జనవరి 1 నాటికి 20 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
గ్రౌండ్‌ డ్యూటీ- టెక్నికల్‌
ఏరోనాటికల్‌ ఇంజనీర్‌ - ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్‌ + (నాలుగేళ్ల గ్రాడ్యుయేషన/ ఇంటిగ్రేటెడ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేషన) (ఇంజనీరింగ్‌/టెక్నాలజీ)పూర్తిచేసి ఉండాలి లేదా ఎఎంఐఇ/ ఎఎస్‌ఐ/ ఐఇటిఇ వారి సెక్షన ఎ, బి పూర్తిచేసి ఉండాలి. అర్హతకు సంబంధించిన డిసిప్లిన్స వివరాలను ప్రకటనలో చూడవచ్చు.
వయసు: 2018 జనవరి 1 నాటికి 20 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి.

గ్రౌండ్‌ డ్యూటీ - నాన్ టెక్నికల్‌
అడ్మినిస్ట్రేషన్, లాజిస్టిక్స్‌
అర్హత: 60 శాతం మార్కులతో సాధారణ డిగ్రీగానీ ఎఎంఐఇ/ ఎఎస్‌ఐ వారి సెక్షన ఎ,బి గానీ పూర్తిచేసి ఉండాలి. డిసిప్లిన్స వివరాలకోసం ప్రకటన చూడవచ్చు.
అకౌంట్స్‌
అర్హత: ఫస్ట్‌క్లాస్‌ మార్కులతో బికాం డిగ్రీ పూర్తిచేసి ఉండాలి
ఎడ్యుకేషన్
అర్హత: 50 శాతం మార్కులతో ఎంబిఏ/ ఎంసిఏ గానీ (ఎంఏ/ ఎమ్మెస్సీ)(ఇంగ్లీష్‌/ ఫిజిక్స్‌/ మేథమెటిక్స్‌/ కెమిసీ్ట్ర/ స్టాటిస్టిక్స్‌/ ఇంటర్నేషనల్‌ రిలేషన్స/ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌/ డిఫెన్స స్టడీస్‌/సైకాలజీ/ కంప్యూటర్‌ సైన్స/ ఐటి/ మేనేజ్‌మెంట్‌/ మాస్‌ కమ్యూనికేషన/జర్నలిజం/ పబ్లిక్‌ రిలేషన్స) గానీ ఉత్తీర్ణులై ఉండాలి. అయితే డిగ్రీలో ఫస్ట్‌క్లాస్‌ మార్కులు తెచ్చుకొని ఉండాలి.
వయసు: 2018 జనవరి 1 నాటికి 20 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ఎఎఫ్‌క్యాట్‌/ఇకెటి టెస్ట్‌, ఇంటర్వ్యూ, మెడికల్‌ ఎగ్జామ్‌ ద్వారా
ఎయిర్‌ఫోర్స్‌ కామన అడ్మిషన టెస్ట్‌(ఎఎఫ్‌క్యాట్‌), ఇంజనీరింగ్‌ నాలెడ్జ్‌ టెస్ట్‌(ఇకెటి)
తేదీ: 2017 ఫిబ్రవరి 26
తెలుగు రాషా్ట్రలకు సంబంధించి పరీక్ష కేంద్రం: హైదరాబాద్‌
ట్రైనింగ్‌ ప్రారంభం: 2018 జనవరి నుంచి
ట్రైనింగ్‌ వ్యవధి: ఫ్లయింగ్‌, గ్రౌండ్‌ డ్యూటీ(టెక్నికల్‌) అభ్యర్థులకు 74 వారాలు కాగా గ్రౌండ్‌ డ్యూటీ (నాన టెక్నికల్‌)అభ్యర్థులకు 52 వారాలు.
ఆనలైన దరఖాస్తుకు ఆఖరు తేదీ: డిసెంబరు 29

వెబ్‌సైట్‌: www.careerairforce.nic.in

బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌


న్యూఢిల్లీలోని డైరెక్టరేట్‌ జనరల్‌ బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బిఎస్‌ఎఫ్‌)- అసిస్టెంట్‌ సబ్‌ ఇనస్పెక్టర్‌ (స్టెనోగ్రాఫర్‌), హెడ్‌ కానిస్టేబుల్‌(మినిస్టీరియల్‌) పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
సబ్‌ ఇనస్పెక్టర్‌(స్టెనోగ్రాఫర్‌)
ఖాళీలు: 36
అర్హత: ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండాలి. నిమిషానికి 80 ఇంగ్లీష్‌ పదాలు లేదా పది నిమిషాలకు 80 హిందీ పదాలతో షార్ట్‌ హ్యాండ్‌ వేగం ఉండాలి. ట్రానస్ర్కిప్షన ఆఫ్‌ డిక్టేషన ఇంగ్లీష్‌లో 50 నిమిషాలు, హిందీలో 65 నిమిషాల వ్యవధిలో పూర్తి చేయాలి
హెడ్‌ కానిస్టేబుల్‌(మినిస్టీరియల్‌)
ఖాళీలు: 121
అర్హత: ఇంటర్‌ పాసై ఉండాలి. నిమిషానికి 35 ఇంగ్లీషు పదాలు లేదా 30 హిందీ పదాల టైపింగ్‌ స్పీడ్‌ ఉండాలి.
వయసు: 2017 జనవరి 1 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, ఫిజికల్‌ మెజర్మెంట్‌ టెస్ట్‌, షార్ట్‌హ్యాండ్‌ / టైపింగ్‌ స్పీడ్‌ టెస్ట్‌, మెడికల్‌ ఎగ్జామ్‌, డాక్యుమెంట్స్‌ వెరిఫికేషన ద్వారా
పూర్తి వివరాలను ‘ఎంప్లాయ్‌మెంట్‌ న్యూస్‌’ డిసెంబరు 3-9 సంచికలో చూడవచ్చు.

వెబ్‌సైట్‌: www.bsf.nic.in


తెలంగాణ పోస్టల్‌ సర్కిల్‌
తెలంగాణ పోస్టల్‌ సర్కిల్‌ - కింది పోస్టుల భర్తీకి స్పోర్ట్స్‌ పర్సన్స నుంచి దరఖాస్తులు కోరుతోంది.
స్పోర్ట్స్‌ కోటాలో ఖాళీలు: 8
పోస్టులు: పోస్టల్‌ అసిస్టెంట్‌/ సార్టింగ్‌ అసిస్టెంట్‌ 5, పోస్ట్‌మన/ మెయిల్‌ గార్డ్‌ 2, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ 1
అర్హత: పోస్టల్‌ అసిస్టెంట్‌/ సార్టింగ్‌ అసిస్టెంట్‌కు ఇంటర్‌ ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌, టైపింగ్‌ నాలెడ్జ్‌ ఉండాలి. ఇంటర్‌(ఒకేషనల్‌ కోర్స్‌/ జాబ్‌ ఓరియంటెడ్‌ కోర్సు) చదివిన అభ్యర్థులు దరఖాస్తుకు అనర్హులు. పోస్టుమనకు పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌కు పదోతరగతి / ఐటిఐ కోర్సు చేసి ఉండాలి. అభ్యర్థులకు ఉండాల్సిన స్పోర్ట్స్‌ క్వాలి ఫికేషన వివరాల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు.
వయసు: దరఖాస్తు నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.100
అభ్యర్థులు దరఖాస్తు ఫారాన్ని వెబ్‌సైట్‌ నుంచి డౌనలోడ్‌ చేసుకొని పూర్తిచేసి కింది చిరునామాకు పంపుకోవాలి.
దరఖాస్తు స్వీకరణకు ఆఖరు తేదీ: 2017 జనవరి 2
చిరునామా: Chief Postmaster General, Telangana Circle, Hyderabad- 500001

వెబ్‌సైట్‌: www.appost.in


ఇండియన్ బ్యాంక్‌‌లో పీవోలు



ఇండియన్ బ్యాంక్‌- ప్రొబెషనరీ ఆఫీసర్స్‌ పోస్టుల భర్తీకోసం ఉద్దేశించిన ‘పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా (బ్యాంకింగ్‌  ఫైనాన్స) కోర్సులో ప్రవేశానికి ప్రకటన విడుదల చేసింది. ఈ కోర్సును బెంగళూరులోని మణిపాల్‌ గ్లోబల్‌ ఎడ్యుకేషన సర్వీసెస్‌ సహకారంతో నిర్వహిస్తోంది.
మొత్తం ఖాళీలు: 324 (జనరల్‌కు 165 పోస్టులను కేటాయించారు)
అర్హత: జూలై 1 నాటికి మొదటి శ్రేణిలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: జూలై 1 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ప్రిలిమినరీ ఎగ్జామ్‌, మెయిన ఎగ్జామ్‌, ఇంటర్వ్యూ ద్వారా. ఎంపికైన అభ్యర్థులను ఇండియన బ్యాంక్‌ ఒకఎఐలో ప్రొబెషనరీ ఆఫీసర్స్‌గా నియమిస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.600(రిజర్వుడు వర్గాలకు రూ.100)
ప్రిలిమినరీ ఎగ్జామ్‌ కాల్‌ లెటర్స్‌ డౌనలోడింగ్‌:
2017 జనవరి 11 తరవాత
ప్రిలిమినరీ ఆనలైన్ ఎగ్జామ్‌: 2017 జనవరి 22
ప్రిలిమినరీ ఆనలైన్ ఎగ్జామ్‌ ఫలితాల విడుదల: 2017 జనవరి 30
మెయిన్ ఆనలైన్ ఎగ్జామ్‌ కాల్‌ లెటర్స్‌ డౌనలోడింగ్‌: 2017 ఫిబ్రవరి 16
మెయిన్ ఆనలైన్ ఎగ్జామ్‌: 2017 ఫిబ్రవరి 28
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పరీక్ష కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్‌
ఆనలైనలో అప్లికేషన ఫీజు చెల్లించేందుకు ఆఖరు తేదీ: డిసెంబరు 22
ఆనలైన దరఖాస్తుకు ఆఖరు తేదీ: డిసెంబరు 22

వెబ్‌సైట్‌: http://indianbank.in/


ఏపీపీఎస్సీ గ్రుప్-2 పోస్టులు



ఆంధ్రప్రదేశ్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్  గ్రూప్‌ 2 పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తు ప్రోఫార్మా, నిబంధనలు కమిషన వెబ్‌సైట్‌లో ఉన్నాయి. దరఖాస్తు దారులు ముందుగా తమ బయోడేటా వివరాలను 'One Time Profile Registration(OTPR) ద్వారా కమిషన వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలి. అప్పుడే యూజర్‌ ఐడి జనరేట్‌ అవుతుంది. ఈ ఐడి నెంను అభ్యర్థుల మొబైల్‌ నెం, ఇమెయిల్‌ ఐడిలకు పంపుతారు. ఈ OTPR నెం ద్వారానే అభ్యర్థులు గ్రూప్‌ 2 పోస్టులకు దరఖాస్తులు పంపుకోవాలి.
మొత్తం ఖాళీలు: 982
ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు
ఖాళీలు: 442
విభాగాలవారీ ఖాళీలు: మున్సిపల్‌ కమిషనర్‌(గ్రేడ్‌ 3) 12, ఎసిటిఒ 96, సబ్‌ రిజిసా్ట్రర్‌(గ్రేడ్‌ 2) 27, డిప్యూటీ తహసిల్దార్‌ 253, అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ 8, అసిస్టెంట్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ 23, ఎక్స్‌టెన్షన ఆఫీసర్‌(పంచాయితీరాజ్‌) 8, ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ 15
నాన్ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు
ఖాళీలు: 540
విభాగాలవారీ ఖాళీలు: అసిస్టెంట్‌ సెక్షన ఆఫీసర్‌ (జిఏడి 67, ఫైనాన్స 16, లా 18, లెజిస్లేచర్‌ 23), సీనియర్‌ ఆడిటర్‌ 45, సీనియర్‌ అకౌంటెంట్‌ (ట్రెజరీ 82, జిల్లా ఉప సర్వీసులు 158, ఇన్సూరెన్స 1, ఎపిజిఎల్‌ఐ 10), జూనియర్‌ అకౌంటెంట్‌ 39, జూనియర్‌ అసిస్టెంట్‌ (15 శాఖలు) 81
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: పోస్టును అనుసరించి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వివరణాత్మక టేబుల్‌ను ప్రకటనలో చూడవచ్చు.
ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వుడ్‌ వర్గాలవారికి సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక: స్ర్కీనింగ్‌ టెస్ట్‌, మెయిన్స్ పరీక్షల ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. 25వేల కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే స్ర్కీనింగ్‌ టెస్ట్‌ను ఆఫ్‌లైన విధానంలో నిర్వహిస్తారు.
మెయిన్స్ ఎగ్జామ్‌ మాత్రం ఆనలైన విధానంలో మాత్రమే జరుగుతుంది.
అభ్యర్థుల సౌకర్యార్థం మాక్‌ టెస్ట్‌లను కూడా కమిషన నిర్వహిస్తుంది. వెబ్‌సైట్‌ మెయిన పేజీలో మాక్‌ టెస్ట్‌ ఆప్షన ఉంది. ఎగ్జామ్‌కు వారం రోజుల ముందు హాల్‌ టికెట్స్‌ను డౌన్ లోడ్‌ చేసుకోవచ్చు.
పరీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశలోని అన్ని జిల్లాలు సహా హైదరాబాద్‌లోను పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
దరఖాస్తు ఫీజు: అప్లికేషన ప్రాసెసింగ్‌ పీజు కింద రూ.250 + పరీక్ష ఫీజు కింద రూ.80 చెల్లించాలి
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: నవంబరు 11 నుంచి
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరుతేదీ: డిసెంబరు 10
స్ర్కీనింగ్‌ టెస్ట్‌: 2017 ఫిబ్రవరి 26
మెయిన్స్ ఎగ్జామ్‌: 2017 మే 20, 21
వెబ్‌సైట్‌: www.psc.ap.gov.in

ప్రభుత్వ బ్యాంకుల్లో 4,122 ఉద్యోగాలు



ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్ (ఐబిపిఎస్‌) ద్వారా పలు విభాగాల్లో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 
పార్టిసిపేట్‌ చేస్తున్న బ్యాంకులు: అలహాబాద్‌ బ్యాంక్‌, ఆంధ్రా బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, ఇండియన బ్యాంక్‌, ఇండియన ఓవర్సీస్‌ బ్యాంక్‌, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, పంజాబ్‌& సింధ్‌ బ్యాంక్‌, సిండికేట్‌ బ్యాంక్‌, యూకో బ్యాంక్‌, యూనియన బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, విజయా బ్యాంక్‌
మొత్తం ఖాళీలు: 4122
ఐటి ఆఫీసర్‌ స్కేల్‌ 1
ఖాళీలు: 335
అర్హత: బిఇ/ బిటెక్‌/ ఎంఇ/ ఎంటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి
అగ్రికల్చర్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌ స్కేల్‌ 1
ఖాళీలు: 2580
అర్హత: డిగ్రీ(అగ్రికల్చర్‌/ హార్టికల్చర్‌/ యానిమల్‌ హజ్‌బెండ్రీ/ వెటర్నరీ సైన్స్/ డైరీ సైన్స్/ అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌/ ఫిషర్‌సైన్స్/ పిసి కల్చర్‌/ అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ / కో ఆపరేషన- బ్యాంకింగ్‌/ ఆగ్రో ఫారెసీ్ట్ర) ఉత్తీర్ణులై ఉండాలి
రాజభాష అధికారి స్కేల్‌ 1
ఖాళీలు: 65
అర్హత: గ్రాడ్యుయేషన లెవల్లో ఇంగ్లీష్‌/ హిందీ ఒక సబ్జెక్టుగా చదివి పీజీ(హిందీ/ సంస్కృతం) పూర్తి చేసి ఉండాలి.
లా ఆఫీసర్‌ స్కేల్‌ 1
ఖాళీలు: లా డిగ్రీ పూర్తిచేసి బార్‌ కౌన్సెల్‌లో రిజిస్టరై ఉండాలి
హెచ్ఆర్‌/ పర్సనల్‌ ఆఫీసర్‌ స్కేల్‌ 1
ఖాళీలు: 81
అర్హత: పీజీ(పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌/ ఇండసి్ట్రయల్‌ రిలేషన్స్/ హెచ్ఆర్‌/సోషల్‌ వర్క్స్‌/ లేబర్‌ లా) ఉత్తీర్ణులై ఉండాలి.
మార్కెటింగ్‌ ఆఫీసర్‌ స్కేల్‌ 1
ఖాళీలు: 946
అర్హత: డిగ్రీ + ఎంబిఏ(మార్కెటింగ్‌0/ పీజీడిబిఏ/ పీజీడిబిఎం పూర్తిచేసి ఉండాలి.
వయసు: నవంబరు 1 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ఆన్‌లైన్ ఎగ్జామ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా
పరీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ పరీక్ష నిమిత్తం ప్రముఖ నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌ కేంద్రాలను ఎంచుకోవచ్చు.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: నవంబరు 16 నుంచి
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: డిసెంబరు 2
కాల్‌ లెటర్‌ డౌనలోడింగ్‌: 2017 జనవరి 16 తరవాత
ఆన్ లైన్ ఎగ్జామ్‌: 2017 జనవరి 28, 29 ‌ఫలితాల వెల్లడి: 2017 ఫిబ్రవరి 16
ఇంటర్వ్యూ కాల్‌ లెటర్‌ డౌనలోడింగ్‌: 2017 ఫిబ్రవరి 24 తరవాత
ఇంటర్వ్యూ : 2017 మార్చిలో
అభ్యర్థుల ఫైనల్‌ సెలక్షన: 2017 ఏప్రిల్‌ 1 తరవాత
వెబ్‌సైట్‌: www.ibps.in/cwe-specialist-officers-6/

Tuesday, December 20, 2016

పైసా ఖర్చు లేకుండా కిడ్నీ లో రాళ్లు కరుగుతాయి !! II

పైసా ఖర్చు లేకుండా కిడ్నీ లో రాళ్లు కరుగుతాయి


click on below link

http://www.manahindhuthvam.com/melt-the-stones-in-the-kidney-without-spending-a-dime-ii/


అమెజాన్ క్రిస్మస్ బంపర్ ఆఫర్లివే!

అమెజాన్ క్రిస్మస్ బంపర్ ఆఫర్లివే!
మోటోరోలా అభిమానులకు అమెజాన్ బంపర్ ఆఫర్లు తీసుకొచ్చింది. మోటోరోలా మోటో జీ4, మోటో జీ4 ప్లస్, మోటో జీ4 ప్లే ఫోన్లపై భారీ డిస్కౌంట్లను తమ ఫ్లాట్ ఫామ్ పై ఆఫర్ చేస్తున్నట్టు అమెజాన్ వెబ్ సైట్ ప్రకటించింది. ఈ మోడల్స్ ను కొనుగోలు చేసిన వారికి ఫ్లాట్ ధరపై రూ.2000 వరకు డిస్కౌంట్ లభిస్తుందని వెల్లడించింది. 
 
మోటో జీ4 ప్లస్ ఫోన్:
32 జీబీ వేరియంట్ కలిగిన ఈ ఫోన్ ధర రూ.14,999లు కాగ ఫ్లాట్ పై రూ.1000 డిస్కౌంట్ ను అమెజాన్ అందిస్తోంది. దీంతో ఈ ఫోన్ రూ.13,999కే అమెజాన్ లో లభించనుంది. అదేవిధంగా 16జీబీ వేరయంట్ ఫోన్ కూడా రూ.12,499కే లభించనుందని వెల్లడించింది. 
 
మోటో జీ4 ఫోన్:
మోటో జీ 4వ తరం ఫోన్ పై రూ.2,000 డిస్కౌంట్ ను అమెజాన్ అందుబాటులో ఉంచింది. రూ.13,999 ధర కల్గిన 32 జీబీ వేరియంట్ ఈ ఫోన్ రూ.11,999కే లభించనుంది.  అంతేకాక 16జీబీ వేరియంట్ ఫోన్ రూ.10,499కు అందుబాటులో ఉంచనున్నట్టు అమెజాన్ పేర్కొంది. 
 
మోటో జీ 4 ప్లే ఫోన్:
మోటో జీ ప్లే 4వ తరం ఈ ఫోన్ పై రూ.500 వరకు డిస్కౌంట్ ను ఈ వెబ్ సైట్ ఆఫర్ చేయనుంది. రూ.8,999 ధర కల్గిన ఈ ఫోన్, రూ.8,499కి కొనుగోలు చేసుకునేలా అవకాశం కల్పిస్తోంది. 
 
వీటితో పాటు స్టాండర్డ్ చార్టడ్ డెబిట్, క్రెడిట్ కార్డులపై 10 శాతం క్యాష్ బ్యాక్ ను, హెచ్ డీఎఫ్ సీ కార్డులపై 5 శాతం క్యాష్ బ్యాక్ ను అమెజాన్ ఆఫర్ చేయనుంది. అదనంగా ఈఎంఐలో మోటో జడ్ ప్లే ఫోన్ న కొనుగోలు చేసిన కస్టమర్లకు, అమెజాన్.ఇన్ గిప్ట్ రూపంలో క్యాష్ బ్యాక్ ను అందించనున్నామని వెల్లడించింది. 

Monday, December 19, 2016

500/1000 నోట్ల రద్దు వెనుక అసలు రహస్యం ఇది

500/1000 నోట్ల రద్దు వెనుక అసలు రహస్యం ఇది



Open below link and read

BSF Recruitment 2016-17 – 157 ASI & HC Posts

BSF Recruitment 2016-17 – 157 ASI & HC Posts


BSF Recruitment 2016-17 – 157 ASI & HC Posts: Directorate General Border Security Force, New Delhi has announced a notification for the recruitment of 157 Assistant Sub Inspector (Stenographer) and Head Constable (Ministerial) posts in BSF 2016-17. Interested candidates are requested to apply in prescribed format on the BSF website on or before 30 days after publication of this advertisement in Employment News / Rozgar Samachar. More details like age limit, educational qualification, selection process, pay scale, how to apply & other information are mentioned below link:



రూ.5వేలు కంటే ఎక్కువ డిపాజిట్ చేయొద్దు

రూ.5వేలు కంటే ఎక్కువ డిపాజిట్ చేయొద్దు


పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత బ్యాంకు అకౌంట్ల‌టో న‌గ‌దు డిపాజిట్స్‌పై ప‌రిమితులు విధిస్తూ కొత్త రూల్స్ ప్ర‌వేశ‌పెట్టింది రిజ‌ర్వ్ బ్యాంక్‌. ఇక‌పై రద్దు అయిన నోట్ల‌తో ఒక్క ఖాతాలో ఒక్క‌సారి మాత్ర‌మే రూ.5వేలు డిపాజిట్ చేయొచ్చ‌ని పేర్కొంది. ఆ పై చేసిన ఖాతాల‌పై నిఘా ఉంటుంద‌ని.. ఖాతాదారుడు వివ‌ర‌ణ ఇవ్వాల్సి ఉంటుంద‌ని RBI  స్ప‌ష్టం చేసింది. డిసెంబ‌ర్ 30 వ‌ర‌కు ఈ నిబంధ‌న అమ‌లు చేయాల్సిందిగా అన్ని బ్యాంకుల‌కు మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. రూ.5వేల కంటే త‌క్కువ మొత్తాన్ని ఎన్నిసార్లైనా డిపాజిట్ చేసుకోవ‌చ్చ‌ని చెప్పిన RBI.. డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్స్‌కు ప‌రిమితులు లేవ‌ని వివ‌రించింది. ఇత‌రుల అకౌంట్స్‌లో పెద్ద‌మొత్తంలో న‌గ‌దు డిపాజిట్ చేసి న‌ల్ల‌కుబేరులు వాటిని పొందుతున్న నేప‌థ్యంలో కేంద్రం ఈ కొత్త నిబంధ‌న‌ను తీసుకొచ్చింది.

8 మంది యాంకర్లను తొలగించిన టీవీ చానల్.. కారణం అదే

8 మంది యాంకర్లను తొలగించిన టీవీ చానల్.. కారణం అదే



టీవీలో కనిపించాలంటే అందంగా, నాజూగ్గా ఉండాలని తెలిసిందే. అయితే లావుగా అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఈజిప్టు ప్రభుత్వ చానల్ 8 మంది మహిళా ఉద్యోగులను తొలగించింది. నెలరోజుల్లో సన్నబడి నాజూగ్గా తయారైతేనే ఉద్యోగం ఉంటుందని తేల్చి చెప్పింది. విషయం తెలిసిన మహిళా సంఘాలు ఈజిప్షియన్ రేడియో అండ్ టెలివిజన్ యూనియన్ (ఈఆర్టీయూ) తీరుపై భగ్గుమంటున్నాయి. మరోవైపు సస్పెన్షన్‌కు గురైన యాంకర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజంగా తాను లావుగా ఉన్నానో లేదో అనే విషయాన్ని ప్రజలను అడిగి తెలుసుకోవాలని.. అయినా తనను ప్రజలు బాగానే ఆదరిస్తున్నారని ఓ యాంకర్ పేర్కొంది.
ఇదంతా కావాలనే కక్షతో చేసిన పని అని ఇంకో యాంకర్ ఆవేదన వ్యక్తం చేసింది. టీవీ యాజమాన్యం చర్యతో తన కుటుంబ సభ్యులు తీవ్ర మనస్తాపంలో కూరుకుపోయారని మరో యాంకర్ తెలిపింది. ఉమెన్స్ సెంటర్ ఫర్ గైడెన్స్ అండ్ లీగల్ అవేర్‌నెస్ చానల్ చర్యను ఖండించింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. అయితే.. ఈ విషయంలో ఏమాత్రం తగ్గేది లేదని చానెల్ చెబుతోంది. సన్నబడితేనే విధుల్లోకి తీసుకుంటామని అంటోంది. మరోవైపు ఈ ఘటనపై పార్లమెంటులోనూ వాడివేడిగా చర్చలు జరుగుతున్నాయి.

ప్రపంచ రికార్డ్స్ బద్దలుకొట్టిన టీమిండియా

ప్రపంచ రికార్డ్స్ బద్దలుకొట్టిన టీమిండియా


టీమిండియా చెలరేగిపోతుంది. చెన్నై టెస్ట్ లో రికార్డ్స్ బద్దలు కొడుతోంది. కరుణ నాయర్ చెలరేగిపోయాడు. 303 పరుగులు చేశాడు. 32 ఫోర్లు, 4 సిక్స్ లతో స్టేడియం హోరెత్తించాడు. 381 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ చేశాడు. స్ట్రయిక్ రేట్ 80గా ఉంది. 20-20 మ్యాచ్ లా బ్యాటింగ్ తో అలరించాడు. ఒకే ఇన్నింగ్స్ లో 759 పరుగులు చేసి.. టెస్ట్ క్రికెట్ లో టీమిండియా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన ఇండియా.. 282 పరుగుల ఆధిక్యంలో ఉంది.

చెన్నై టెస్ట్ రికార్డ్స్

… ఒకే ఇన్నింగ్స్ లో 750పైగా పరుగులు చేయటం టీమిండియా క్రికెట్ చరిత్రలో ఇదే. 2009లో శ్రీలంకపై 726 పరుగులే నిన్నటి వరకు రికార్డ్. ఆ మ్యాచ్ లో ధోనీ సెంచరీ చేశాడు. ఇప్పుడు కోహ్లీ హయాంలో ఆ రికార్డ్ బద్దలు అయ్యింది.
… టెస్ట్ క్రికెట్ లోకి ఎంటర్ అయిన మూడో మ్యాచ్ లోనే త్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా కరుణ నాయర్ రికార్డ్. 25 ఏళ్ల నాయర్ గత రెండు మ్యాచ్ ల్లో అత్యధిక స్కోర్ 13 పరుగులు మాత్రమే. మూడో మ్యాచ్ లోనే త్రిపుల్ సెంచరీ చేయటం విశేషం.
… 759/7 టెస్ట్ క్రికెట్ చరిత్రలో.. టాప్ సెవెన్ ఇన్నింగ్స్ స్కోర్ లలో ఇది ఒకటి.
… ఇప్పటి వరకు సెహ్వాగ్ మాత్రమే ట్రిపుల్ సెంచరీ చేశాడు. సెహ్వాగ్ తర్వాత సచిన్ కు కూడా సాధ్యంకాని ట్రిపుల్ సెంచరీతో నాటౌట్ గా నిలిచిన ఆటగాడిగా నాయర్ గుర్తింపు.
… ఐదో బ్యాట్స్ మెన్ గా వచ్చి ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడు నాయర్ మాత్రమే.
… ఇంగ్లండ్ పై అత్యధిక పరుగులు కూడా ఇదే. స్కోర్ 759/7

చంద్రబాబు నాకు రూ.64వేలు అప్పున్నాడు

చంద్రబాబు నాకు రూ.64వేలు అప్పున్నాడు

విజయనగరం: ‘అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు నిరుద్యోగులకు ఉద్యోగం లేదా నెలకు రూ.2వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి  రెండు సంవత్సరాల ఎనిమిది నెలులు అయింది. నిరుద్యోగిగా ఉన్న నాకు ఆయన ఇప్పటివరకూ రూ.64 వేలు అప్పు ఉన్నాడు. నేను ఇప్పుడు ఎవరిని అడగాలి’  అని బీటెక్‌ చదువుతున్న రోహిత్‌  అనే ఓ విద్యార్థి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన యువభేరి కార్యక్రమంలో తన ఆవేదన వ్యక్తం చేశాడు.  

చంద్రబాబు అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలం అయ్యారని, అలాగే ఇస్తామన్న నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదని పేర్కొన్నాడు. డిగ్రీ పూర్తి చేసిన ప్రతి నిరుద్యోగికి నెలకు రెండువేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు చెప్పారని, అలా నెలకు రెండువేలు చొప్పున తనకు రూ.64వేలు అప్పు ఉన్నారన్నాడు. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కోసం  చంద్రబాబు రూ.300 కోట్లు ఖర్చు పెట్టారని, ఆ డబ్బు విద్యార్థుల కోసం ఖర్చు పెట్టి ఉంటే 30 వేల కుటుంబాలు బాగుపడేవన్నాడు. అలాగే  ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ విషయంలోనూ చంద్రబాబు విద్యార్థులను మోసం చేశారని అన్నాడు.

ఇక ప్రత్యేక హోదా అయిదేళ్లు కాదు, పదినేహేళ్లు కావాలన్న చంద్రబాబు ఇప్పుడు ఫ్లేటు ఫిరాయించారని, పెట్టుబడులంటూ ప్రత్యేక విమానాల్లో తిరిగిన ఆయన... రాష్ట్రానికి ఏ మేరకు పెట్టుబడులు తెచ్చారో చెప్పాలని  నిఖిల అనే విద్యార్థిని ఈ సందర్భంగా ప్రశ్నలు సంధించింది.  సామాన్యులను మోసం చేసినట్లే విద్యార్థులను కూడా మోసం చేస్తున్నారన్నారు. సింగపూర్‌ కు చంద్రబాబుకు ఉన్న సంబంధమేంటో చెప్పాలని డిమాండ్‌ చేసింది.

పీఎఫ్ ఖాతాదారులకు షాకిచ్చిన ప్రభుత్వం

పీఎఫ్ ఖాతాదారులకు షాకిచ్చిన ప్రభుత్వం

 పీఎఫ్ ఖాతాదారుల ఆశలపై  ప్రభుత్వం నీళ్లు చల్లింది.  రిటైర్మెంట్ నిధి సంస్థ, ఎంప్లాయాస్  ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఒ) వడ్డీరేట్లలో భారీగా కోత పెట్టింది. సోమవారం బెంగళూరులో జరిగిన  ఈపీఎఫ్   సెంట్రల్ ట్రస్టీ  భేటీలో   2016-17ఆర్థిక సంవత్సరానికి డిపాజిట్లపై వడ్డీరేటును  8.65 శాతంగా ప్రకటించింది. గత ఏడాది ఇది 8.8 శాతంగా ఉంది. అలాగే  ప్రస్తుత రేటు ఏడేళ్ల కనిష్టం. దీంతో సుమారు  4 కోట్ల మంది  పీఎఫ్  ఖాతాదారులపై దీని ప్రభావం పడనుంది.
ఈపీఎఫ్ వో కేంద్ర ట్రస్టీల బోర్డు సభ్యులు ప్రస్తుత వడ్డీరేట్లను  ఆశించనంతగా   పెంచలేదు.  కనీసం యధాతథ స్థితిని కూడా కొనసాగించక పోవడంతో ఖాతాదారులు   షాకయ్యారు. డీమానిటైజేషన్ తర్వాత  దేశంలో నెలకొన్న అనిశ్చిత ఆర్థిక వాతావరణంలో  సంస్థ నిర్ణయం వారిలో భారీ నిరాశను మిగిల్చింది.
కాగా 2015-16  సం.రానికిగాను  గత ఏడాది 8.7 శాతంగా ఉన్న వడ్డీరేటును 8.8 శాతానికి పెంచిన  సంగతి తెలిసిందే.

Sunday, December 18, 2016

బ్యాంక్ ఖాతాదారులకు RBI షాక్

బ్యాంక్ ఖాతాదారులకు RBI షాక్


పెద్దనోట్ల రద్దు తర్వాత పెద్దమొత్తంలో నగదు డిపాజిట్ చేసి విత్ డ్రా చేసుకోవాలనుకునే ఖాతాదారులు పాన్ కార్డ్ సమర్పించాలని ఆర్బీఐ ప్రకటించింది. ఖాతాలో రూ. 2 లక్షలకు మించి ఉన్న అకౌంట్ హోల్డర్స్  పాన్ కార్డ్ నమోదు చేసుకోవాలన్నారు. రూ. 5 లక్షలకు మించి ఉంటే పాన్ తప్పని సరి అని వెల్లడించింది. పాన్ కార్డ్ లేకుంటే ఫారం నెంబర్ 60 ను బ్యాంకుల్లో అందజేయాలని తెలియజేశారు. ఇదివరకు రూ. 50 వేలకు మించి ట్రాన్సాక్షన్స్ జరిపే కస్టమర్లు బ్యాంకు కేవైసీలో పాన్ లేదా ఏదైనా గుర్తింపు కార్డు నమోదు చేసుకోవాలని చెప్పిన సంగతి తెలిసిందే.
వీటికి పాన్ కార్డ్ తప్పని సరి
… రూ. 2 లక్షలు అంతకు మించి నగదు జమచేసిన వాళ్లు
… రూ. 5 లక్షలకు మించి నగదు నిల్వలు ఉన్న ఖాతాదారులు
… జనధన్ ఖాతాలో రూ. 50 వేలు దాటిన ఖాతాదారులకు ఇకపై పాన్ కార్డ్ తప్పనిసరి
ఇక జనధన్ ఖాతాదారులకు ఇది వర్తిస్తుందన్నారు. ప్రస్తుతం నెలకు రూ. 10 వేలకు మించి విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం లేదు. రూ. 50 వేలకు మించి డిపాజిట్ అయిన జన్ ధన్ ఖాతారులపై ఐటీ డిపార్ట్ మెంట్ నిఘా పెట్టింది. కొన్ని జన్ ధన్ ఖాతాలను సీజ్ చేశామని వెల్లడించింది.

వ్యవసాయంతోనే ఊరంతా కోటీశ్వరులు

వ్యవసాయంతోనే ఊరంతా కోటీశ్వరులు


ఆ గ్రామంలో అందరూ ధనవంతులే. అలా అని వ్యాపారవేత్తల ఊరనుకునేరు. కాయకష్టం మీదే ఆధారపడిన గ్రామం . పక్కా వ్యవసాయ ఆధారిత పల్లెటూరు. భూతల స్వర్గంలా ఉన్న ఆ గ్రామం చైనాలో ఉంది. పేరు హుయాక్సి. ఈ గ్రామ విస్తీర్ణం చదరపు కిలోమీటర్. ఆ గ్రామం ఇప్పుడు ప్రపంచాన్నే ఆకర్శిస్తోంది.. కాదు కాదు డబ్బుతోనూ శాసిస్తోంది.
ఒకప్పుడు పూరి గుడిసెలతో.. ఊరంతా నిరుపేదలతో ఉండేది హుయాక్సి.  నేడు ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామంగా మారింది. 1961 నుంచి గ్రామం దశ తిరిగింది. ఆ ఏడాది ఆ ఊరికి యురేన్ బావో కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా ఎంపికయ్యారు. ఆనాటి నుంచి నేటి వరకు ఆ గ్రామంలో ఉన్న 1600 కుటుంబాలు సమిష్టిగా పని చేస్తూ అద్భుతమైన విజయాలు సాధించాయి. ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ సొంత విల్లాలు, ఖరీదైన కార్లు ఉన్నాయి. గ్రామంలోని ప్రజలందరికీ వైద్యంతో పాటు గ్యాస్, వంటనూనె ఉచితంగానే సరఫరా చేస్తారు. ఆ చిరు గ్రామాన్ని ఇప్పటికే 20 లక్షల మంది టూరిస్టులు సందర్శించారు. వాళ్లంతా దీన్ని చైనా దుబాయిగా పేరు పెట్టారు.
పాడిపంటలే ఆధారం
ఇక్కడ పాడిపంటలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఖరీదైన కార్లతో పాటు ఎడ్ల బండ్లు, ఆవులు సర్వసాధారణంగా కనపడతాయి. ఇక్కడ అత్యంత ఖరీదైన ఆవు ధర ఎంతో తెలుసా.. అక్షరాల 500 మిలియన్ యువాన్ లు. అదే మన కరెన్సీలో దాని విలువ 48 కోట్ల రూపాయలు. ఇక్కడ వ్యవసాయంతో పాటు ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీలు, స్టీలు మిల్లులు, టెక్స్ టైల్ పార్కులు ఉన్నాయి. ఈ గ్రామం పారిశ్రామిక రంగంలో అత్యధిక అభివృద్ధి దశకు చేరుకోవడంతో.. చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి వేలాది మంది కార్మికులు ఇక్కడ పరిశ్రమల్లో పని చేస్తారు. సహకార రంగంలో అందరూ వాటాదారులే. సంవత్సరానికి సరాసరి లక్ష డాలర్లు వాటాగా వస్తోంది. 328 మీటర్ల ఎత్తైన 60 అంతస్తుల బిల్డింగ్ ఉంది. ఈ భవనం కూడా బీజింగ్ లో ఉన్నటువంటి ప్రపంచ ట్రేడ్ సెంటర్ లాంటిదే. ఈ గ్రామంలో రెండు వేల మంది యాత్రికులు బస చేయడానికి అన్ని రకాల విలాసవంతమైన సౌకర్యాలతో కూడిన హోటల్ నిర్మించారు. దీనికంతటికీ కారణం ఆ గ్రామానికి సంబంధించిన స్థానిక కమ్యూనిస్ట్ పార్టీ యురేన్ బావోనే.
ప్రస్తుతం ఆయన వయస్సు 86ఏళ్లు. ఇప్పుడు ఆయన కుమారుడు ఆ గ్రామ కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా ఉన్నారు. తన తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ మరింత అభివృద్ధి పథంలో గ్రామాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. ఆ గ్రామంలో అందరూ చదువుకున్నవారే. అయినప్పటికీ ప్రతి ఒక్కరూ విధిగా సేద్యం చేస్తారు. 55 ఏళ్లుగా ఆ గ్రామ ప్రజలంతా హాయిగా జీవిస్తున్నారు. ఎలాంటి వివాదాలు లేని జీవితాలను గడుపుతున్నారు.

NLC Recruitment 2016-17

NLC Recruitment 2017 Notification 90 Graduate Executive Trainee Posts 


Open this link below,

NLC Recruitment 2017 Notification 90 Graduate Executive Trainee Posts Apply Online


ఓం న‌మో వెంక‌టేశాయా కొత్త ఫోటోలు

ఓం న‌మో వెంక‌టేశాయా కొత్త ఫోటోలు



కింగ్ నాగార్జున భ‌క్తుడి పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం ఓం న‌మో వెంక‌టేశాయా. ద‌ర్శ‌కేంద్రులు కె.రాఘ‌వేంద్ర రావు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. నాగార్జున ఈ చిత్రంలో వెంక‌టేశ్వ‌ర‌స్వామి ప్రియ శిష్యుడు హాతీరాంబాబాగా న‌టిస్తున్నాడు. ఇప్ప‌టికే విడుద‌లైన నాగ్ లుక్ అంద‌రినీ ఆక‌ట్టుకోగా తాజాగా చిత్ర బృందం మ‌రో రెండు ఫోటోల‌ను అభిమానుల‌కోసం రిలీజ్ చేసింది. ఈ ఫోటోలు కూడా అభిమానుల‌ను భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ భ‌క్తిర‌స చిత్రంలో అనుష్క కూడా మంచి పాత్ర‌ను పోషిస్తోంది.

అమ్మగా..శివగామి..!

అమ్మగా..శివగామి..!


ప్రస్తుతం బయోఫిక్‌‌ల ట్రెండ్ బాగా నడుస్తోంది. అందుకే డైరెక్టర్లంతా ఫ్యామిలీ ఓరియెంటేడ్, లవ్ సినిమాలు కాకుండా బయోఫిక్‌ల వైపు రూటు మార్చారు. ఇప్పటికే పలువురి జీవిత గాథలను తెరకెక్కించి దర్శకులు సొమ్ము చేసుకున్నారు. ఇక తెలుగు, తమిళ భాషల్లో అయితే లెక్కలేనన్ని సినిమాలు వచ్చాయి. ఈ క్రమంలోనే తమిళనాడు ప్రజల గుండెల్లో అమ్మగా కొలువైన నేత జయలలిత. ఆమె జీవితచరిత్రను సినిమాగా తెరకెక్కిస్తే బాగుంటుందన్న చర్చ సోషల్‌ మీడియాలో సాగుతోంది. ఆమె పాత్రలో ఎవరు నటిస్తే బాగుంటుందన్న ఊహాగానాలు సాగుతున్నాయి. ఇదే సమయంలో సోషల్‌ మీడియాలో దర్శనమిచ్చిన ఓ పోస్టర్‌ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ‘బాహుబలి’ సినిమాలో శివగామిగా అలరించిన రమ్యకృష్ణను అమ్మ మాదిరిగా ఫొటోషాప్‌ చేసి రూపొందించిన ఈ పోస్టర్‌ వైరల్‌గా మారిపోయింది.
ఈ పోస్టర్‌ను మెచ్చుకుంటున్న నెటిజన్లు జయలలిత పాత్రకు రమ్యకృష్ణ అయితే కరెక్ట్ గా  ఉంటుందని భావిస్తున్నారు. ఫుల్లీ ఫిల్మీ అనే ఫేస్‌బుక్‌ పేజీ ఈ పోస్టర్‌ను రూపొందించింది. ‘మదర్‌’ పేరిట మార్ఫింగ్ చేసి  రూపొందించిన ఈ పోస్టర్‌లో జయలలితపై సినిమాకు దర్శకుడిగా కార్తిక్‌ సుబ్బరాజు ఉంటే బాగుంటుందని పేర్కొంది.
సోషల్‌ మీడియాలో బాగా చక్కర్లు కొడుతున్న ఈ పోస్టర్‌పై స్పందించిన రమ్యకృష్ణ…  ఎవరో కల్పితంగా సృష్టించిన ఈ పోస్టర్‌ను వాట్సాప్‌లో తనకు స్నేహితులు పంపించారని  తెలిపింది. ఇది కేవలం కల్పితమైన పోస్టర్‌ అయినప్పటికీ, నిజంగా జయలలిత జీవితకథలో నటించేందుకు తాను ఎంతో ఆసక్తితో ఉన్నానని పేర్కొంది. ‘గతంలో నాకు డ్రీమ్‌రోల్స్‌ అంటూ ఉండేవి కావు.  కానీ ఇప్పుడు ఎవరైనా మీ డ్రీమ్‌రోల్‌ ఏమిటని అడిగితే.. అది జయలలిత పాత్ర పోషించడమేనని కచ్చితంగా చెప్తాను  అని అన్నారు. మంచి స్క్రిప్టుతో ప్రముఖ దర్శకుడు ముందుకొస్తే జయ మేడం పాత్రను పోషించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని తెలిపింది రమ్యకృష్ణ.

హైదరాబాద్ లో కాల్పుల కలకలం

హైదరాబాద్ లో కాల్పుల కలకలం


హైదరాబాద్ లో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. మాసబ్ ట్యాంక్ శాంతినగర్ కాలనీలోని ఓ ఇంట్లో కాల్పులు జరిగాయి. కేబీఎస్ బ్యాంక్ లో మేనేజర్ గా పనిచేస్తున్న మన్మధ దాలియాపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దాలియా ఇంట్లోనే కాల్పులు జరిగాయి. డబ్బుల విషయంపై మాట్లాడుతున్న టైంలోనే కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. గుర్తు తెలియని వ్యక్తి రివాల్వర్ తో రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్టు సమాచారం. దీంతో దాలియాకు ఓ బుల్లెట్ తగిలింది. అతడిని వెంటనే కేర్ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. కాల్పులు జరిపిన దుండగులు  తర్వాత  బైక్ పై పరారీ అయినట్లు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలిసిన వెంటనే వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకును పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆర్ధిక లావాదేవీలే కాల్పులకు కారణమని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.