బ్యాంక్ ఖాతాదారులకు RBI షాక్
పెద్దనోట్ల రద్దు తర్వాత పెద్దమొత్తంలో నగదు డిపాజిట్ చేసి విత్ డ్రా చేసుకోవాలనుకునే ఖాతాదారులు పాన్ కార్డ్ సమర్పించాలని ఆర్బీఐ ప్రకటించింది. ఖాతాలో రూ. 2 లక్షలకు మించి ఉన్న అకౌంట్ హోల్డర్స్ పాన్ కార్డ్ నమోదు చేసుకోవాలన్నారు. రూ. 5 లక్షలకు మించి ఉంటే పాన్ తప్పని సరి అని వెల్లడించింది. పాన్ కార్డ్ లేకుంటే ఫారం నెంబర్ 60 ను బ్యాంకుల్లో అందజేయాలని తెలియజేశారు. ఇదివరకు రూ. 50 వేలకు మించి ట్రాన్సాక్షన్స్ జరిపే కస్టమర్లు బ్యాంకు కేవైసీలో పాన్ లేదా ఏదైనా గుర్తింపు కార్డు నమోదు చేసుకోవాలని చెప్పిన సంగతి తెలిసిందే.
వీటికి పాన్ కార్డ్ తప్పని సరి
… రూ. 2 లక్షలు అంతకు మించి నగదు జమచేసిన వాళ్లు
… రూ. 5 లక్షలకు మించి నగదు నిల్వలు ఉన్న ఖాతాదారులు
… జనధన్ ఖాతాలో రూ. 50 వేలు దాటిన ఖాతాదారులకు ఇకపై పాన్ కార్డ్ తప్పనిసరి
ఇక జనధన్ ఖాతాదారులకు ఇది వర్తిస్తుందన్నారు. ప్రస్తుతం నెలకు రూ. 10 వేలకు మించి విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం లేదు. రూ. 50 వేలకు మించి డిపాజిట్ అయిన జన్ ధన్ ఖాతారులపై ఐటీ డిపార్ట్ మెంట్ నిఘా పెట్టింది. కొన్ని జన్ ధన్ ఖాతాలను సీజ్ చేశామని వెల్లడించింది.
No comments:
Post a Comment