హైదరాబాద్ లో కాల్పుల కలకలం
హైదరాబాద్ లో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. మాసబ్ ట్యాంక్ శాంతినగర్ కాలనీలోని ఓ ఇంట్లో కాల్పులు జరిగాయి. కేబీఎస్ బ్యాంక్ లో మేనేజర్ గా పనిచేస్తున్న మన్మధ దాలియాపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దాలియా ఇంట్లోనే కాల్పులు జరిగాయి. డబ్బుల విషయంపై మాట్లాడుతున్న టైంలోనే కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. గుర్తు తెలియని వ్యక్తి రివాల్వర్ తో రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్టు సమాచారం. దీంతో దాలియాకు ఓ బుల్లెట్ తగిలింది. అతడిని వెంటనే కేర్ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. కాల్పులు జరిపిన దుండగులు తర్వాత బైక్ పై పరారీ అయినట్లు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలిసిన వెంటనే వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకును పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆర్ధిక లావాదేవీలే కాల్పులకు కారణమని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.
No comments:
Post a Comment