రూ.5వేలు కంటే ఎక్కువ డిపాజిట్ చేయొద్దు
పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకు అకౌంట్లటో నగదు డిపాజిట్స్‌పై పరిమితులు విధిస్తూ కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది రిజర్వ్ బ్యాంక్. ఇకపై రద్దు అయిన నోట్లతో ఒక్క ఖాతాలో ఒక్కసారి మాత్రమే రూ.5వేలు డిపాజిట్ చేయొచ్చని పేర్కొంది. ఆ పై చేసిన ఖాతాలపై నిఘా ఉంటుందని.. ఖాతాదారుడు వివరణ ఇవ్వాల్సి ఉంటుందని RBI స్పష్టం చేసింది. డిసెంబర్ 30 వరకు ఈ నిబంధన అమలు చేయాల్సిందిగా అన్ని బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ చేసింది. రూ.5వేల కంటే తక్కువ మొత్తాన్ని ఎన్నిసార్లైనా డిపాజిట్ చేసుకోవచ్చని చెప్పిన RBI.. డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌కు పరిమితులు లేవని వివరించింది. ఇతరుల అకౌంట్స్‌లో పెద్దమొత్తంలో నగదు డిపాజిట్ చేసి నల్లకుబేరులు వాటిని పొందుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చింది.
Good job!
ReplyDelete