రూ.2వేల నోటు రద్దు.?
త్వరలోనే రూ.2వేల నోటును ప్రభుత్వం రద్దు చేయనుందా..? ఎందుకు రద్దు చేయాలనుకుంటోంది..? రద్దు చేసిన తర్వాత చిన్న డినానిమినేషన్ నోట్లను ప్రవేశపెడుతుందా..? అంటే అవుననే సమాధానం చెబుతున్నారు ఆర్ఎస్ఎస్ నేత ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ గురుమూర్తి.
రానున్న ఐదేళ్లలో రూ.2వేల నోటును ప్రభుత్వం రద్దు చేస్తుందని పక్కాగా చెప్పారు గురుమూర్తి. రూ.2వేల నోటును ప్రభుత్వం తాత్కాలికంగా ప్రవేశపెట్టిందని చెప్పిన ఆయన… హఠాత్తుగా పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడే ఇబ్బందులను రూ.2వేల నోటుతో పూడ్చాలనే ఉద్దేశంతోనే కేంద్రం రూ.2వేల నోటును విడుదల చేసిందని చెప్పుకొచ్చారు.
చిన్న నోట్లనే చలామణిలో ఉంచాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉన్నట్లు గురుమూర్తి వెల్లడించారు. అత్యధిక డినామినేషన్‌గా రూ.500 నోటునే చలామణిలో ఉంచే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఆ తర్వాత రూ.250,రూ.100 నోట్లను విడుదల చేస్తుందని గురుమూర్తి వివరించారు.
పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎలా వ్యవహరించాలనేదానిపై కేంద్ర ప్రభుత్వ పెద్దలు గురుమూర్తి దగ్గర నుంచి కొన్ని సూచనలు తీసుకుంటున్నట్లు సమాచారం.
No comments:
Post a Comment