ఓం నమో వెంకటేశాయా కొత్త ఫోటోలు
కింగ్ నాగార్జున భక్తుడి పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఓం నమో వెంకటేశాయా. దర్శకేంద్రులు కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నాగార్జున ఈ చిత్రంలో వెంకటేశ్వరస్వామి ప్రియ శిష్యుడు హాతీరాంబాబాగా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన నాగ్ లుక్ అందరినీ ఆకట్టుకోగా తాజాగా చిత్ర బృందం మరో రెండు ఫోటోలను అభిమానులకోసం రిలీజ్ చేసింది. ఈ ఫోటోలు కూడా అభిమానులను భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ భక్తిరస చిత్రంలో అనుష్క కూడా మంచి పాత్రను పోషిస్తోంది.
No comments:
Post a Comment