అమ్మ మరణంతో 470 గుండెలు ఆగిపోయాయి
చెన్నై : అన్నాడీఎంకే
అధినేత్రి జయలలిత మరణంతో తమిళనాడులో 470 గుండెలు
ఆగిపోయాయి. అమ్మ ఇక లేదని తెలిసి షాక్‌కు గురై 470 మంది హఠాన్మరణం చెందినట్టు అన్నాడీఎంకే ప్రకటించింది. 203 మంది పేర్ల జాబితాను పార్టీ శనివారం
విడుదల చేసింది. ఒక్కో కుటుంబానికి 3 లక్షల
రూపాయల చొప్పున ఆర్థిక సాయం
అందించనున్నట్టు పేర్కొంది. జయ అభిమానులకు అన్నివిధాలా
అండగా ఉంటామని భరోసాయిచ్చింది.
No comments:
Post a Comment