పీఎఫ్ ఖాతాదారులకు షాకిచ్చిన ప్రభుత్వం
పీఎఫ్ ఖాతాదారుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. రిటైర్మెంట్ నిధి సంస్థ, ఎంప్లాయాస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఒ) వడ్డీరేట్లలో భారీగా కోత పెట్టింది. సోమవారం బెంగళూరులో జరిగిన ఈపీఎఫ్ సెంట్రల్ ట్రస్టీ భేటీలో 2016-17ఆర్థిక సంవత్సరానికి డిపాజిట్లపై వడ్డీరేటును 8.65 శాతంగా ప్రకటించింది. గత ఏడాది ఇది 8.8 శాతంగా ఉంది. అలాగే ప్రస్తుత రేటు ఏడేళ్ల కనిష్టం. దీంతో సుమారు 4 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులపై దీని ప్రభావం పడనుంది.
ఈపీఎఫ్ వో కేంద్ర ట్రస్టీల బోర్డు సభ్యులు ప్రస్తుత వడ్డీరేట్లను ఆశించనంతగా పెంచలేదు. కనీసం యధాతథ స్థితిని కూడా కొనసాగించక పోవడంతో ఖాతాదారులు షాకయ్యారు. డీమానిటైజేషన్ తర్వాత దేశంలో నెలకొన్న అనిశ్చిత ఆర్థిక వాతావరణంలో సంస్థ నిర్ణయం వారిలో భారీ నిరాశను మిగిల్చింది.
కాగా 2015-16 సం.రానికిగాను గత ఏడాది 8.7 శాతంగా ఉన్న వడ్డీరేటును 8.8 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే.

No comments:
Post a Comment