కేసీఆర్ దగ్గరున్న బంగారం ఎంతో తెలుసా!
సీఎం కేసీఆర్ దగ్గర ఎంత బంగారం ఉంది.. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా.. కిలోల కొద్దీ ఉండి ఉంటుంది అని అందరూ అనుకోవటం సహజం. కానీ అలా ఏమీ లేదు. కేసీఆర్ దగ్గర ఉన్నది కేవలం మూడు ఉంగరాలు, మెడలో ఓ చైన్ మాత్రమే. ఇక భార్య శోభ దగ్గర 50-60 తులాల బంగారం మాత్రమే ఉందంట. ఈ విషయలో కేసీఆరే స్వయంగా అసెంబ్లీలో చెప్పుకొచ్చారు. నోట్ల రద్దుపై మండలిలో చర్చ సందర్భంగా ఈ ప్రస్తావన చేశారు. పూజ గదిలో దేవుడి సామాను రూపంలో కొన్ని వెండి వస్తువులు ఉన్నాయన్నారు. తన సతీమణి దగ్గర ఉన్న 50-60 తులాల బంగారం కూడా వారసత్వంగా వచ్చిందన్నారు. ఆభరణాల రూపంలో ఉన్న బంగారం లెక్కలు ఏ ప్రభుత్వం అడగదని.. వివరాలు కోరదని స్పష్టం చేశారు. ఆ లెక్కే అడిగితే వ్యతిరేకించటానికి ఫస్ట్ నేనే ఉంటా అన్నారు కేసీఆర్. మహిళల బంగారం జోలికొస్తే తెలంగాణ అంతటి ఉద్యమం చేయటానికి నేనే మొదట ఉంటానన్నారు. కడ్డీలు, బిస్కెట్ల రూపంలో ఉన్న బంగారానికి మాత్రమే లెక్క చెప్పాల్సి ఉంటుందన్నారు.
No comments:
Post a Comment