చంద్రబాబు నాకు రూ.64వేలు అప్పున్నాడు
విజయనగరం: ‘అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు నిరుద్యోగులకు ఉద్యోగం లేదా నెలకు రూ.2వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రెండు సంవత్సరాల ఎనిమిది నెలులు అయింది. నిరుద్యోగిగా ఉన్న నాకు ఆయన ఇప్పటివరకూ రూ.64 వేలు అప్పు ఉన్నాడు. నేను ఇప్పుడు ఎవరిని అడగాలి’ అని బీటెక్ చదువుతున్న రోహిత్ అనే ఓ విద్యార్థి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన యువభేరి కార్యక్రమంలో తన ఆవేదన వ్యక్తం చేశాడు.
చంద్రబాబు అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలం అయ్యారని, అలాగే ఇస్తామన్న నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదని పేర్కొన్నాడు. డిగ్రీ పూర్తి చేసిన ప్రతి నిరుద్యోగికి నెలకు రెండువేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు చెప్పారని, అలా నెలకు రెండువేలు చొప్పున తనకు రూ.64వేలు అప్పు ఉన్నారన్నాడు. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కోసం చంద్రబాబు రూ.300 కోట్లు ఖర్చు పెట్టారని, ఆ డబ్బు విద్యార్థుల కోసం ఖర్చు పెట్టి ఉంటే 30 వేల కుటుంబాలు బాగుపడేవన్నాడు. అలాగే ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలోనూ చంద్రబాబు విద్యార్థులను మోసం చేశారని అన్నాడు.
ఇక ప్రత్యేక హోదా అయిదేళ్లు కాదు, పదినేహేళ్లు కావాలన్న చంద్రబాబు ఇప్పుడు ఫ్లేటు ఫిరాయించారని, పెట్టుబడులంటూ ప్రత్యేక విమానాల్లో తిరిగిన ఆయన... రాష్ట్రానికి ఏ మేరకు పెట్టుబడులు తెచ్చారో చెప్పాలని నిఖిల అనే విద్యార్థిని ఈ సందర్భంగా ప్రశ్నలు సంధించింది. సామాన్యులను మోసం చేసినట్లే విద్యార్థులను కూడా మోసం చేస్తున్నారన్నారు. సింగపూర్ కు చంద్రబాబుకు ఉన్న సంబంధమేంటో చెప్పాలని డిమాండ్ చేసింది.

No comments:
Post a Comment