Saturday, December 17, 2016

ఫ్లాష్ న్యూస్ ...! జనవరి 1 నుండి మళ్లీ వాడుకలోకి పాత 500 నోట్లు

జనవరి 1 నుండి మళ్లీ వాడుకలోకి పాత 500 నోట్లు 



ఫ్లాష్ న్యూస్ ...!
ఇది నిజామా? అబద్దమా?   అని పక్కన పెడితే సోషల్ మీడియాలో ఈ వార్తకు విపరీతమైన చర్చ జరుగుతుంది.
జాతీయ స్థాయిలోని కొందరు సీనియర్ జర్నలిస్టులు, ఆర్ధిక నిపుణులు చేస్తున్న సూచనలు ఇలానే కనిపిస్తున్నాయి. డిసంబర్ 31 కి నోట్ల రద్దు కష్టాలు తీరతాయని ప్రధానమంత్రి మోదీ పలుమార్లు ప్రకటించారు. కానీ, ప్రస్తుతం మార్కెట్లో చూస్తున్న పరిణామాలను గమనిస్తే ఆ సూచనలు ఏవీ కనిపించడం లేదు. వచ్చే ఏడాది మే ఎండింగ్ వరకు ఈ సమస్యలు కొనసాగుతాయని పలువురు నిపుణులు, బ్యాంకింగ్ రంగం అధికారులు పదే పదే చెబుతున్నారు. దీంతో, చాలా మంది చెబుతున్న సూచన ఏమిటంటే కేంద్రం ఇకనైనా ఈ విషయంపై పట్టు విడుపు ధోరణి అవలంభించాలని, దానికి మొదటి ప్రయత్నంగా కొత్త నోట్లు మార్కెట్లో పూర్తిగా చెలామణిలోకి రావడానికి చాలా సమయం పడుతుంది కనుక, ముందుగా కొంత కాలం పాత 500 నోట్లు ప్రవేశపెడితే మంచిదని చెబుతున్నారు. వీటితో తాత్కాలిక ఉపశమనం కలుగుతుందని నెల రోజులుగా స్తంభించిన ఆర్ధిక లావాదేవీలన్నీ మళ్లీ ఎప్పటిలాగే నడుస్తాయని అంటున్నారు. ఈ చర్చతో ప్రభుత్వం కూడా చాలా వరకు విమర్శల నుండి గట్టెక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రూ.1000 నోటుపై అలాగే ఉంచి మినిమమ్ మరో రెండు నెలలపాటు కొత్త నోట్లను ప్రవేశపెడితే చాలని చెబుతున్నారు. డిల్లీ స్థాయిలో దీనిపై ఇప్పటికే గట్టిగా వాదనలు వినిపిస్తున్నాయి. ఇది కూడా మంచి సూచనగా భావిస్తున్నారు చాలా మంది. మరి మోదీ సర్కార్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. 

No comments:

Post a Comment